బుజ్జమ్మ పాత్ర అందరికీ నచ్చేస్తుంది

ABN, Publish Date - Oct 22 , 2024 | 02:20 AM

హీరోయిన్‌ అనన్య నాగళ్ల నటించిన తాజా చిత్రం ‘పొట్టేల్‌’. యువచంద్రకృష్ణ కథానాయకుడు. సాహిత్‌ మోత్కూరి దర్శకత్వంలో సురేశ్‌కుమార్‌ సడిగె నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతున్న సందర్భంగా...

హీరోయిన్‌ అనన్య నాగళ్ల నటించిన తాజా చిత్రం ‘పొట్టేల్‌’. యువచంద్రకృష్ణ కథానాయకుడు. సాహిత్‌ మోత్కూరి దర్శకత్వంలో సురేశ్‌కుమార్‌ సడిగె నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతున్న సందర్భంగా అనన్య మీడియాతో ముచ్చటించారు. ‘‘ఈ కథ విన్నప్పుడే ఇందులో తప్పకుండా భాగం అవ్వాలనుకున్నా. ఇందులో బుజ్జమ్మ అనే పాత్రలో నటించాను. నేను ఇదివరకు నటించిన సినిమాలతో పోలిస్తే ఇందులో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ మంచి గుర్తింపు తెచ్చే చిత్రమిది. ప్రతీ పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో కథానాయకుడు యువచంద్రది ‘పొట్టేల్‌’ లాంటి మనస్తత్వం. ఎంత కష్టమొచ్చినా... ధైర్యంతో ముందుకెళ్లి ఢీకొనడమే తన నైజం. ఆయనతో కలసి నటించడం మరిచిపోలేని అనుభూతి. దర్శకుడు సాహిత్‌ మోత్కూరి తన మేకింగ్‌ స్కిల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తారు.


అజయ్‌ నటన ఈ సినిమాకు హైలెట్‌గా ఉండనుంది. శేఖర్‌ చంద్ర అందించిన సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. చక్కటి సందేశంతో పాటు తగినన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను మిక్స్‌ చేసిన ఈ సినిమా అందరినీ అలరిస్తుంది.

Updated Date - Oct 22 , 2024 | 02:20 AM