చెన్నైలో బిజీ బిజీ
ABN, Publish Date - Nov 21 , 2024 | 06:29 AM
బుట్టబొమ్మ పూజాహెగ్డే ప్రస్తుతం చెన్నైలో సందడి చేస్తున్నారు. షూటింగ్ నిమిత్తం ఆమె కొన్ని రోజులుగా నగరంలో మకాం వేశారు. విజయ్
బుట్టబొమ్మ పూజాహెగ్డే ప్రస్తుతం చెన్నైలో సందడి చేస్తున్నారు. షూటింగ్ నిమిత్తం ఆమె కొన్ని రోజులుగా నగరంలో మకాం వేశారు. విజయ్ నటిస్తున్న (విజయ్ 69- వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్‌లో పూజా పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ‘చెన్నై మార్నింగ్స్ డే 16’ అంటూ సూర్యోదయం ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో కథానాయకుడిగా తనకు ఇదే చివరి చిత్రం అని విజయ్ ప్రకటించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో వెంకట్ కే నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022లో వచ్చిన ‘బీస్ట్’ చిత్రంలోనూ విజయ్ సరసన పూజాహెగ్డే నటించారు. ఆమె ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో సూర్యతో నటిస్తున్నారు. హిందీలో షాహిద్‌కపూర్‌తో ‘దేవా’ చిత్రం చేస్తున్నారు.