నవ్వుల్లో ముంచెత్తుతుంది
ABN, Publish Date - Oct 09 , 2024 | 12:58 AM
‘‘విశ్వం’ సినిమాతో పాత శ్రీను వైట్లను మళ్లీ చూడబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్, ఫన్, కామెడీ అద్భుతంగా వచ్చాయి. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ‘విశ్వం’ ఆధ్యంతం నవ్వుల్లో ముంచెత్తుతుంది’ అని హీరో గోపిచంద్ అన్నారు...
‘‘విశ్వం’ సినిమాతో పాత శ్రీను వైట్లను మళ్లీ చూడబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్, ఫన్, కామెడీ అద్భుతంగా వచ్చాయి. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ‘విశ్వం’ ఆధ్యంతం నవ్వుల్లో ముంచెత్తుతుంది’ అని హీరో గోపిచంద్ అన్నారు. ఆయన కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన చిత్రమిది. . టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నెల 11న విడుదలవుతోన్న సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ ‘విశ్వప్రసాద్‌గారి వల్ల సినిమాకు మరింత బలం చేకూరింది. శ్రీనువైట్ల స్ర్కిప్ట్ మీద ఏడు నెలలు పనిచేశారు. ఆయనతో పని చేయడాన్ని ఆస్వాదించాను’ అని చెప్పారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘రెండున్నర గంటల్లో ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టదు. విశ్వ ప్రసాద్, వేణు నిర్మాణంలో రాజీ పడలేదు. ఈ హిట్‌తో దసరాని ఎంజాయ్ చేయబోతున్నాం’ అని చెప్పారు.
‘నేను అమెరికాలో ఉన్నప్పుడే శ్రీను వైట్ల గారి సినిమాలు బాగా చూసేవాణ్ణి. ఇప్పుడు ఆయనతో ఈ సినిమా చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది’ అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ‘విశ్వం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ప్రేక్షకులకు పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది’ అని కావ్యథాపర్ తెలిపారు.