Brahmmavaram PS Paridhilo: ‘బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో’ విడుదల తేదీ ఫిక్సయింది

ABN, Publish Date - Aug 17 , 2024 | 02:15 PM

డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న “బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో” చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 23, 2024న థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. స్రవంతి బెల్లంకొండ ఇందులో నటించడమే కాకుండా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

Brahmmavaram PS Paridhilo Movie Still

డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ (Dreamz On Reelz Entertainment) బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ‘బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో’ (Brahmmavaram PS Paridhilo) చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇమ్రాన్ శాస్త్రి (Imran Sastry) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 23, 2024న థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. స్రవంతి బెల్లంకొండ, గురు, సూర్య శ్రీనివాస్, హర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సినిమాటిక్ ట్రీట్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. స్రవంతి బెల్లంకొండ ఇందులో నటించడమే కాకుండా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

చిత్ర విడుదల తేదీ ప్రకటన సందర్భంగా నటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత స్రవంతి బెల్లంకొండ (Sravanthi Bellamkonda) మాట్లాడుతూ.. “ఈ సినిమాకి నిజమైన హీరో ఎవరంటే.. కచ్చితంగా కథే అని చెబుతాను. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మొదటి ఆప్షన్ అవుతుంది. సమ్మెట గాంధీ, ప్రేమ్ సాగర్, జీవా, రూప లక్ష్మి వంటి ప్రతిభావంతులైన నటీనటులతో పనిచేయడం మెమరబుల్ ఎక్స్‌పీరియెన్స్. నన్ను ప్రధాన పాత్రలో ఎంపిక చేసినందుకు టీమ్‌కి కృతజ్ఞతలు. ఆగస్ట్ 23న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దర్శకుడు ఈ సినిమా నెక్ట్స్ లెవల్ అన్నట్లుగా చిత్రీకరించారు. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు మెచ్చే చిత్రమవుతుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము..’’ అని తెలిపారు. (Brahmmavaram PS Paridhilo Ready to Release)


ఒక్కోసారి మిస్టేక్ కూడా న్యాయం చేస్తుంది అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రానికి ఆవుల వెంకటేష్ ఎడిటర్‌గా, సాకేత్ సాయిరామ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, ముజీర్ మాలిక్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. మరిన్ని వివరాలను విడుదలలోపు మేకర్స్ తెలియజేయనున్నారు.

Updated Date - Aug 17 , 2024 | 02:15 PM