కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బ్రహ్మానందంకు స్వర్ణకంకణం ప్రదానం 3న

ABN, Publish Date - Jan 01 , 2024 | 04:44 AM

ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ రాగ సప్తస్వరం 35వ వార్షికోత్సవం సందర్భంగా ప్రఖ్యాత హాస్య నటుడు బ్రహ్మానందంకు జీవన సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణకంకణం ప్రదానం చేయనున్నారు...

ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ రాగ సప్తస్వరం 35వ వార్షికోత్సవం సందర్భంగా ప్రఖ్యాత హాస్య నటుడు బ్రహ్మానందంకు జీవన సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణకంకణం ప్రదానం చేయనున్నారు. ఈ నెల 3న రవీంద్రభారతిలో సాయంత్రం 6గంటలకు జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. దీంతో పాటు ప్రముఖ నాట్య గురువు సుజత వింజమూరికి ఆత్మీయ సత్కారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాగసప్తస్వరం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ బుధవారం జరగనున్న వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ లక్ష్మణ్‌, నటుడు మురళీమోహన్‌ హాజరవుతారని తెలిపారు.

Updated Date - Jan 01 , 2024 | 04:44 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!