బ్రహ్మ ఆనందం సందడి
ABN, Publish Date - Aug 20 , 2024 | 02:36 AM
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా నటిస్తున్న ‘బ్రహ్మ ఆనందం’ చిత్రం గ్లింప్స్‌ను రాఖీ పండగ సందర్భంగా సోమవారం విడుదల చేశారు....
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా నటిస్తున్న ‘బ్రహ్మ ఆనందం’ చిత్రం గ్లింప్స్‌ను రాఖీ పండగ సందర్భంగా సోమవారం విడుదల చేశారు. బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిశోర్ .. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే కథతో వినోదాల విందు వడ్డించడానికి కొత్త దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ సిద్ధమవుతున్నారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా తెలిపారు.