మలయాళ హక్కులు కొన్నారు

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:27 AM

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న భారీ పీరియాడికల్‌ థ్రిల్లర్‌ ‘క’ చిత్రం మలయాళ థియేట్రికల్‌ రైట్స్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌కు చెందిన వేఫరర్‌ ఫిల్మ్స్‌ సంస్థ....

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న భారీ పీరియాడికల్‌ థ్రిల్లర్‌ ‘క’ చిత్రం మలయాళ థియేట్రికల్‌ రైట్స్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌కు చెందిన వేఫరర్‌ ఫిల్మ్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ చూసి దుల్కర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘క’ తెలుగు హక్కుల్ని నిర్మాత వంశీ నందిపాటి ఇప్పటికే పొందారు. నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

Updated Date - Sep 10 , 2024 | 03:27 AM