అవసరమైతే కోర్టుకు వెళ్తా

ABN, Publish Date - Aug 31 , 2024 | 06:10 AM

బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదల ముంగిట వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాను నిషేధించాలంటూ పలు సిక్కు సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన అత్యయిక పరిస్థితి ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రమిది.

బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదల ముంగిట వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాను నిషేధించాలంటూ పలు సిక్కు సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన అత్యయిక పరిస్థితి ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రమిది. ఇందిరా గాంధీ పాత్రను పోషించడంతో పాటు కంగనే ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 06న ‘ఎమర్జెన్సీ’ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు కంగన సన్నాహాలు చేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం విడుదల సందిగ్ధంలో పడింది. తమ చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదని కంగన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమాను విడుదల చేసేందుకు అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని ఆమె చెప్పారు. సినిమాలను విడుదల చేస్తే చంపేస్తామంటూ వస్తున్న బెదిరింపుల గురించి మాట్లాడుతూ ‘నన్ను భయపెట్టాలని చూసినంత మాత్రాన చరిత్ర మారిపోదు కదా’ అని కంగన అన్నారు. సంజయ్‌ గాంధీ పాత్ర పోషించిన విశాక్‌ నాయర్‌కు సైతం బెదిరింపులు వచ్చాయి.

Updated Date - Aug 31 , 2024 | 06:10 AM