బ్లాక్‌బస్టర్ పక్కా
ABN, Publish Date - Oct 15 , 2024 | 12:14 AM
ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఆయన ఈ నెల 19న గచ్చిబౌలిలో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్...
ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఆయన ఈ నెల 19న గచ్చిబౌలిలో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ ఆయన సంగీతం అందిస్తున్న ‘పుష్ప-2’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పుష్ప-2’ సినిమా ఫస్టాఫ్ వినగానే నేనూ, చంద్రబోస్ చప్పట్లు కొట్టాం. ఈ సినిమాను సుకుమార్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం పక్కా’’ అని చెప్పారు. అలాగే, మ్యూజికల్ కన్సర్ట్ గురించి మాట్లాడుతూ ‘‘మన దేశంలో ఇలాంటి మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికి కుదిరింది. ఈ కార్యక్రమం కచ్చితంగా మీ అందరికీ మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది’’ అని అన్నారు.