బర్త్‌డే సర్‌ప్రైజ్!
ABN, Publish Date - Aug 23 , 2024 | 06:32 AM
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘విశ్వంభర’ చిత్రంలోని ఆయన లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఒక రాతిపై కూర్చుని ప్రత్యేక శక్తులు కలిగిన త్రిశూలాన్ని
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘విశ్వంభర’ చిత్రంలోని ఆయన లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఒక రాతిపై కూర్చుని ప్రత్యేక శక్తులు కలిగిన త్రిశూలాన్ని పట్టుకుని ఉన్న మెగాస్టార్ పవర్‌పుల్‌గా అనిపించారు. ఆయన పుట్టినరోజున టీజర్ విడుదల ఉండదని దర్శకుడు వశిష్ట ముందే స్పష్టం చేయడంతో కొంత నిరాశ చెందిన మెగా అభిమానులను ఈ లుక్ సర్‌ప్రైజ్ చేసింది. ‘చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు ఒక అద్భుతమైన తార పోరాడడానికి ప్రకాశిస్తుంది’ అని చిత్రం టీమ్ ఈ పోస్టర్‌లో పేర్కొంది. ‘విశ్వంభర’ చిత్రం కోసం ఓ ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు. అద్భుతమైన డ్రామా, ఎమోషన్స్‌తో ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉంటుందని నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్ చెప్పారు. అలాగే పుట్టినరోజు సందర్భంగా తండ్రితో దిగిన ప్రత్యేక ఫొటోను రామ్‌చరణ్ విడుదల చేశారు.