మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bheema : మంచి విజయం అందించారు

ABN, Publish Date - Mar 10 , 2024 | 06:36 AM

‘భీమ’ చిత్రాన్ని ఆదరించి ఇంత మంచి విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంత మంచి కథను నా దగ్గరకు తెచ్చి, సినిమాను అద్భుతంగా తీసిన దర్శకుడు హర్షకు కృతజ్ఞతలు’ అన్నారు...

‘భీమ’ చిత్రాన్ని ఆదరించి ఇంత మంచి విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంత మంచి కథను నా దగ్గరకు తెచ్చి, సినిమాను అద్భుతంగా తీసిన దర్శకుడు హర్షకు కృతజ్ఞతలు’ అన్నారు హీరో గోపీచంద్‌. తను నటించిన ‘భీమ’ ఇటీవల విడుదలై విజయం సాధించిన నేపథ్యంలో శనివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ ‘సినిమాకు కావాల్సినదంతా సమకూర్చి ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించిన రాధామోహన్‌ గారికి, శ్రీధర్‌ గారికీ ధన్యవాదాలు. ఇంకా సినిమా చూడనివారు తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడండి’ అని కోరారు. గోపీచంద్‌తో ‘పంతం’ సినిమాతో ఏర్పడిన అనుబంధం అలాగే కొనసాగుతోందని నిర్మాత రాధామోహన్‌ చెప్పారు. ఎక్కడా రాజీపడకుండా తీశాం. సినిమా విజువల్స్‌, రిచ్‌నెస్‌ తెరపై కనిపిస్తాయి’ అన్నారు రాధామోహన్‌. టీమ్‌ వర్క్‌కు నిదర్శనం ఈ విజయమని దర్శకుడు హర్ష చెప్పారు.

Updated Date - Mar 10 , 2024 | 06:36 AM