Bhaje Vaayu Vegam: ‘సెట్ అయ్యిందే’ సాంగ్ ప్రోమో వచ్చింది.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?

ABN , Publish Date - May 07 , 2024 | 05:52 PM

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ చిత్రంలోని మొదటి పాట ‘సెట్ అయ్యిందే’ని ఈ నెల 9వ తేదీన ఉదయం 9.09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమో‌ని మేకర్స్ విడుదల చేశారు.

Bhaje Vaayu Vegam: ‘సెట్ అయ్యిందే’ సాంగ్ ప్రోమో వచ్చింది.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?
Bhaje Vaayu Vegam Movie Still

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam). ఈ సినిమా టీజర్‌ను ఇటీవల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘విశ్వంభర’ సెట్స్‌లో విడుదల చేయగా.. ఆ టీజర్ అనూహ్య స్పందనను రాబట్టుకుంది. ఆ ఊపుని కొనసాగిస్తూ చిత్రంలోని మొదటి పాట ‘సెట్ అయ్యిందే’ (Set Ayyindhe Song Promo)ని ఈ నెల 9వ తేదీన ఉదయం 9.09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమో‌ని మేకర్స్ విడుదల చేశారు.

*AP Elections - Pawan Kalyan: సినీరంగం నుంచి ఒక్కొక్కరు బయటికొస్తున్నారు


రథన్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్‌కు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ‘సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే నీ వల్లే నా లైఫ్ సెట్టయ్యిందే, సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే, నా లవ్ స్టోరి బ్లాక్‌బస్టర్ హిట్టయ్యిందే..’ అంటూ సాగిన ఈ 21 సెకన్ల ప్రోమో సాంగ్ ఇంట్రెస్టింగ్‌గా చేసింది. ఈ ప్రోమోలో కార్తికేయ చేసిన ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్స్ హైలైట్ అవుతున్నాయి. ఫుల్ సాంగ్‌లో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) జంట వైరల్ అయ్యేలా ఓ హుక్ స్టెప్‌తో ఆకట్టుకోనున్నారని తెలుస్తోంది. (Set Ayyindhe First Single Promo Out)


Bhaje-Vaayu-Vegam.jpg

తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాలో ‘హ్యాపీ డేస్’ (Happy Days) ఫేమ్ రాహుల్ టైసన్ (Rahul Tyson) కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను, అలాగే ట్రైలర్‌ రిలీజ్ డేట్‌ను త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 07 , 2024 | 05:52 PM