Chiranjeevi Support: సేవకుడిగా, సైనికుడిగా, అన్నయ్యగా నిలబడతాడు.. చిరు పోస్ట్‌ వైరల్‌!

ABN , Publish Date - May 07 , 2024 | 12:00 PM

మెగాస్టార్‌ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచారు. ‘జనమే జయం’ అని నమ్మే జనసేనానిని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు.

Chiranjeevi Support: సేవకుడిగా, సైనికుడిగా, అన్నయ్యగా నిలబడతాడు.. చిరు పోస్ట్‌ వైరల్‌!

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు (Pawan kalyan) మద్దతుగా నిలిచారు. ‘జనమే జయం’ అని నమ్మే జనసేనానిని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు. ఇటీవల జనసేన పార్టీకి రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చిన చిరు మొదటిసారి తన తమ్ముడి పార్టీ గురించి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో  పవన్  లాంటి నాయకుడు కావాలి అన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియోను చిరంజీవి పోస్ట్‌ చేశారు(Chiranjeevi Support to Janasena) . ఆయన ఏమన్నారంటే..

 
"కొణిదెల పవన్ కల్యాణ్‌.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కల్యాణ్‌బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కల్యాణ్‌ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లను తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దుల దగ్గర ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసే జవాన్ల కోసం పెద్ద మొత్తంలో అందించడం, అలాగే మత్స్యకారులు ఇతరత్ర కష్టాలున్న వారికి తన వంతు సాయంగా నిలబడటం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా.. జనాలకు కావలసింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు.

Chiranjeevi.jpg

ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే తన గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ కలుగుతుంది. అలా బాధ పడుతున్న నా తల్లికి ఓ మాట చెప్పాను.  'నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్థం ఇది' అన్నాను. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్థాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. రాష్ట్ర భవిష్యత్తు కోసం శక్తిని వినియోగించాలి అంటే చట్టసభల్లో అతడి గొంతును మనం వినాలి. ‘జనమే జయం’ అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు కల్యాణ్‌ను గెలిపించాలి. మీకు ేసవకుడిగా సైనికుడిగా, అన్నయ్యగా నిలబడతాడు. మీ కోసం కలబడి మీ కలలను నిజం చేస్తాడు’’ అని చిరంజీవి అన్నారు.

Updated Date - May 07 , 2024 | 01:56 PM