Kalki 2898 AD : ‘భైరవ యాంథమ్’ వచ్చేసింది
ABN, Publish Date - Jun 18 , 2024 | 03:47 AM
ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏ.డీ’ నుంచి మొదటి సింగిల్ ‘భైరవ యాంథమ్’ పూర్తి లిరిక్ వీడియో సోమవారం విడువలైంది. సినిమా ప్రచారంలో భాగంగా ఈ పాటను విడుదల చేసిన మేకర్స్.. ఈ సాంగ్‌ను భారతదేశపు అతిపెద్ద పాటగా...
ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏ.డీ’ నుంచి మొదటి సింగిల్ ‘భైరవ యాంథమ్’ పూర్తి లిరిక్ వీడియో సోమవారం విడువలైంది. సినిమా ప్రచారంలో భాగంగా ఈ పాటను విడుదల చేసిన మేకర్స్.. ఈ సాంగ్‌ను భారతదేశపు అతిపెద్ద పాటగా పేర్కొన్నారు. ప్రభాస్, పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజే ఈ పాటలో ఆకట్టుకునే వేషధారణతో తలపాగాలు ధరించి సందడి చేశారు. కథానాయకుడి పాత్ర తీరు తెన్నులను ప్రేక్షకులకు పరిచయం చేసేలా సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి, కుమార్ రాశారు. తెలుగుతో పాటు హిందీ లిరిక్స్ కలగలసిన ఈ సాంగ్‌ను పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజే, విజయనారాయణ్ సంయుక్తంగా ఆలపించగా, సంతోశ్ నారాయణన్ సంగీతం అందించారు. కాగా, ఈ సినిమాకు నాగ్అశ్విన్ దర్శకత్వం వహించగా, అశ్వనీదత్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి భారీ తారాగణం నటించిన ‘కల్కి 2898 ఏ.డీ’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.