Baraabar Premistha: దసరా బరిలో.. ప్రభాకర్ కుమారుడి ‘బరాబర్ ప్రేమిస్తా’.

ABN, Publish Date - Sep 07 , 2024 | 08:55 PM

CC క్రియేషన్స్ పతాకంపై నటుడు, దర్శకుడు ప్రభాకర్ కుమారుడైన చంద్రహాస్ హీరోగా, మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా.. సంపత్. వి. రుద్ర దర్శకత్వంలో గెడా చందు, గాయత్రీ చిన్ని, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ సినిమాను దసరా బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు చెప్పుకొచ్చారు.

Baraabar Premistha Movie Still

CC క్రియేషన్స్ పతాకంపై నటుడు, దర్శకుడు ప్రభాకర్ కుమారుడైన చంద్రహాస్ (Chandrahass) హీరోగా, మేఘన ముఖర్జీ (Meghna Mukherjee) హీరోయిన్‌గా.. సంపత్. వి. రుద్ర దర్శకత్వంలో గెడా చందు, గాయత్రీ చిన్ని, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’ (Baraabar Premistha Movie). అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని దసరా బరిలో దింపేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా వివరాలను మీడియాకు తెలియజేశారు.

Also Read- Game Changer: అభిమానుల నిరీక్షణ ఫలించింది.. అదిరిపోయే పోస్టర్‌తో అప్డేట్

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం ప్యూర్ విలేజ్, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం. మా హీరో చంద్రహాస్, హీరోయిన్ మేఘనా ముఖర్జీ యూత్‌ని ఆకట్టుకునే లవర్స్‌గా అద్భుతంగా నటించారు. ఆర్ఆర్ దృవన్ అందించిన సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అలాగే సురేష్ గంగుల మంచి లిరిక్స్ అందించారు. ఇతర సాంకేతిక నిపుణులంతా వారి వారి ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. దసరా కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. (Baraabar Premistha Movie Release Update)


మేఘన ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, రాజశేఖర్ అనింగి, మధు నందన్, అభయ్ నవీన్, మీసాల లక్ష్మణ్, బతిని కీర్తి లత, సునీత మనోహర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ దృవన్ సంగీతం అందిస్తుండగా.. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Sep 07 , 2024 | 08:55 PM