నరసింహం చేసే సవారి

ABN, Publish Date - Dec 15 , 2024 | 01:51 AM

బాలకృష్ణ కధానాయకుడిగా బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్‌’. బాబీ డియోల్‌, శ్రద్థా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్‌, చాందినీ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు...

బాలకృష్ణ కధానాయకుడిగా బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్‌’. బాబీ డియోల్‌, శ్రద్థా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్‌, చాందినీ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. శనివారం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘ద రేజ్‌ ఆఫ్‌ డాకు’ను విడుదల చేశారు మేకర్స్‌. అనంత శ్రీరామ్‌ రచించిన ఈ గీతాన్ని నకాశ్‌ అజీజ్‌, భరత్‌రాజ్‌, రితేశ్‌.జి.రావు, కె.ప్రణతి ఆలపించారు. తమన్‌ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదలవుతోంది.

Updated Date - Dec 15 , 2024 | 01:51 AM