KCR: ‘కేసీఆర్’కు స్టార్ కమెడియన్ సపోర్ట్

ABN, Publish Date - Nov 08 , 2024 | 10:00 PM

కేసీఆర్‌కు స్టార్ కమెడియన్ సపోర్ట్ చేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? కేసీఆర్ అంటే బీఆర్‌ఎస్ లీడర్ కాదు.. ఇక్కడ ఇంకో చిన్న కేసీఆర్ ఉన్నారు. ఆయనెవరో.. ఆయనకి స్టార్ కమెడియన్ చేసిన సపోర్ట్ ఏంటో తెలుసుకుందామా..

KCR Movie Still

రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) హీరోగా నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్). గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం లంబాడీ వర్గానికి చెందిన యువకుడి రియల్ లైఫ్ నుంచి స్ఫూర్తి పొందింది. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని మేకర్స్ అనౌన్స్ చేశారు. (Keshava Chandra Ramavath Release Date)

Also Read-కుమారుడి పెళ్లిలో కన్నీటితో కూలబడిన స్టార్ యాక్టర్

ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ని విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు సపోర్ట్ అందించారు ‘బలగం’ దర్శకుడు, స్టార్ కమెడియన్ వేణు. ‘బలగం’ సినిమాతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు కమెడియన్, దర్శకుడు వేణు. ఈ సందర్భంగా వేణు (Balagam Venu) మాట్లాడుతూ.. ‘టీం అందరికీ ఆల్ ద బెస్ట్. ఇది మరో బలగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఇక ఈ సినిమా నవంబర్ 22న విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్‌లో రివీల్ చేశారు.

Also Read- దిగ్గజ సంగీత దర్శకుడికి ప్రభుత్వం ఇచ్చిన స్థలం తిరిగి స్వాధీనం


ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రలో రిలీజ్ చేస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్‌కి (దీప ఆర్ట్స్) జోర్దార్ సుజాత రాకేష్ దంపతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వరల్డ్ వైడ్‌గా అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామని, ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని దర్శకుడు అంజి పేర్కొన్నారు. జోర్దార్ సుజాత, ధనరాజ్, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, కృష్ణ భగవాన్, రవి రచ్చ, మధు, లోహిత్ కుమార్ ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రానికి తెలంగాణ మాస్ట్రో ‘చరణ్ అర్జున్’ సంగీతం అందిస్తున్నారు.

Also Read-Mahesh Babu: మహేష్ బాబుకి తేజ సజ్జా, రానా ఎందుకు సారీ చెప్పాలి

Also Read-కేతిక శర్మ: బరువెక్కిన అందాలు.. జారుతున్న హృదయాలు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2024 | 10:00 PM