బలగం మొగిలయ్య కన్నుమూత

ABN, Publish Date - Dec 20 , 2024 | 02:08 AM

‘బలగం’ సినిమాలో భావోద్వేగపూరిత పాటను ఆలపించి ప్రేక్షకులను కదిలించిన మొగిలియ్య(67) మృతి చెందారు. ఆయన కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ...

‘బలగం’ సినిమాలో భావోద్వేగపూరిత పాటను ఆలపించి ప్రేక్షకులను కదిలించిన మొగిలియ్య(67) మృతి చెందారు. ఆయన కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మరణించారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగిలయ్య, కొమురమ్మ దంపతులు తమ పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వచ్చిన కళ బుర్రకథను జీవనాధారంగా మార్చుకున్నారు. మొగిలయ్య టాలెంట్‌ను గుర్తించిన ‘బలగం’ చిత్ర దర్శకుడు వేణు తన సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. మొగిలయ్య, కొమురమ్మ కలసి పాడిన ‘తోడుగా మా తోడుండి ...నీడలా మాతో నడిచి’ అనే పాట సినిమాకే హైలెట్‌గా నిలిచింది. మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు కుమారుడు సుదర్శన్‌, దత్త కుమార్తె మోజేస్‌ ఉన్నారు. మొగిలయ్య అంత్యక్రియలు స్వగ్రామమైన దుగ్గొండిలో ముగిశాయి. మొగిలయ్య మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం సంగీత, సాహిత్య రంగాలకు తీరని లోటు అని పేర్కొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 02:08 AM