కస్తూరికి బెయిల్‌

ABN, Publish Date - Nov 21 , 2024 | 06:24 AM

తెలుగువారి కీర్తి ప్రతిష్టలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన నటి కస్తూరికి ఎగ్మూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నెల మూడున చెన్నైలో జరిగిన ఓ సభలో నటి కస్తూరి

తెలుగువారి కీర్తి ప్రతిష్టలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన నటి కస్తూరికి ఎగ్మూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నెల మూడున చెన్నైలో జరిగిన ఓ సభలో నటి కస్తూరి మాట్లాడుతూ తెలుగు ప్రజలను కించిపరిచేలా విమర్శలు చేశారు. నటి కస్తూరి బెయిల్‌ కోసం హైకోర్టులో పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించడంతో తమిళనాడు పోలీసులు హైదరాబాద్‌లో కస్తూరిని అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. ఎగ్మూరు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా, కస్తూరికి 29వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ మేజిస్ట్రేట్‌ ఆదేశాలివ్వటంతో పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఎగ్మూరు కోర్టులో కస్తూరి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై మేజిస్ట్రేట్‌ దయాళన్‌ బుధవారం విచారణ జరిపి ఆమెకు బెయిల్‌ మంజూరు చేశారు.

- చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Nov 21 , 2024 | 06:24 AM