Bahirbhoomi: ‘బహిర్భూమి’ మూవీ ఫస్ట్ లుక్ వదిలారు

ABN, Publish Date - Sep 17 , 2024 | 10:15 PM

నోయల్, రిషిత నెల్లూరు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘బహిర్భూమి’. ఈ చిత్రాన్ని మహంకాళి ప్రొడక్షన్ బ్యానర్‌పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. ‘బహిర్భూమి’ చిత్రం త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Bahirbhoomi Movie First Look Launch

నోయల్, రిషిత నెల్లూరు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘బహిర్భూమి’ (Bahirbhoomi). ఈ చిత్రాన్ని మహంకాళి ప్రొడక్షన్ బ్యానర్‌పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. ‘బహిర్భూమి’ చిత్రం త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

ఈ కార్యక్రమంలో నిర్మాత మచ్చ వేణు మాధవ్ మాట్లాడుతూ.. సినిమా మీద ప్యాషన్‌తో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ప్రొడ్యూసర్‌గా మూవీస్ చేస్తున్నాను. ‘బహిర్భూమి’ సినిమాకు మా టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు. మా సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ బాగా సపోర్ట్ చేశారు. మిగతా వాళ్లు టాయిలెట్ అంటూ ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టుకున్నారు. మేము ధైర్యంగా ‘బహిర్భూమి’ అని సినిమాకు పేరు పెట్టాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో మంచి డేట్ చూసి గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తామని తెలపగా.. దర్శకుడు రాంప్రసాద్ కొండూరు మాట్లాడుతూ.. ‘బహిర్భూమి’ సినిమాకు హీరో నోయల్ ఎంతో సపోర్ట్ చేశారు. నోయల్, ఫణి వీళ్ల మధ్య కామెడీ సీన్స్ హైలైట్ అవుతాయి. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత వేణు గారికి థ్యాంక్స్. అలాగే సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ ఎంతో సపోర్టివ్‌గా ఉండేవారు. మేము ‘బహిర్భూమి’ అని టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే తెలుస్తుంది. వెస్ట్రన్ కల్చర్ కంటే మన కల్చర్ చాలా గొప్పది. ఈ విషయాన్ని మా మూవీలో అంతర్లీనంగా చెబుతున్నామని అన్నారు.


హీరో నోయల్ మాట్లాడుతూ.. నేను చిన్న మూవీస్ చేయకూడదని అనుకుంటున్న టైమ్‌లో వచ్చిన చిత్రం ‘బహిర్భూమి’. ఈ సినిమాకు ముగ్గురు మెయిన్ పిల్లర్స్. వాళ్లే నిర్మాత వేణు మాధవ్, దర్శకుడు రాంప్రసాద్, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్. వీళ్లు ముగ్గురు లేకుంటే ఈ సినిమా లేదు. ‘బహిర్భూమి’ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమాలో చూడండి. చాలా మంచి మూవీ చేశాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. త్వరలో థియేటర్స్‌లోకి ఈ సినిమా వస్తుందని తెలిపారు. హీరోయిన్ రిషిత నెల్లూరు మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోకి కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు ఉంటాయి. నేను హీరోయిన్‌గా పనికి రానని అన్నవాళ్లూ ఉన్నారు. ఈరోజు ‘బహిర్భూమి’ సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయ్యే అవకాశం దక్కింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ టీమ్‌తో వర్క్ చేయడం మంచి ఎక్సీపీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. త్వరలోనే థియేటర్లలోకి రానున్న ఈ సినిమాను అందరూ థియేటర్లలోనే చూడాలని కోరుతున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్, జబర్దస్త్ ఫణి, డిఓపి ప్రవీణ్ తదితరులు మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ చేయాలని కోరారు.

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?

Read Latest Cinema News

Updated Date - Sep 17 , 2024 | 10:15 PM