Bachhalamalli : రామ్‌చరణ్‌కు ‘రంగస్థలం’... నరేశ్‌కి ‘బచ్చలమల్లి’
ABN, Publish Date - Dec 14 , 2024 | 06:40 AM
అల్లరి నరేశ్, అమృత అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’, సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా మీడియాతో ముచ్చటిస్తూ’ బచ్చలమల్లి 80వ దశకంలోని కథ. చాలా
అల్లరి నరేశ్, అమృత అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’, సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా మీడియాతో ముచ్చటిస్తూ’ బచ్చలమల్లి 80వ దశకంలోని కథ. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథను మూడేళ్ల క్రితమే విన్నాను. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశాను. ఇది ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. క్యారెక్టర్ డ్రివెన్ సినిమా ఇది. ఈ మూవీ డైరెక్టర్ ఊరు తుని. ఆ ఊర్లో బచ్చలమల్లి అనే వ్యక్తి ఉండేవాడు. అతని రియల్ లైఫ్‌లో జరిగిన ఒక సంఘటనను మాత్రమే తీసుకుని అల్లిన కథ. మిగతాదంతా ఫిక్షన్. రామ్‌చరణ్‌కి ‘రంగస్థలం’ ఎలాగో, నరేశ్‌కి ‘బచ్చలమల్లి’ అలాంటి సినిమా అవుతుంది. కథ ప్రకారం సహజమైన లోకేషన్లలో తీయాలని అన్నవరం, తుని చుట్టుపక్కల గ్రామాల్లో చిత్రీకరించాం. మూర్ఖత్వం హద్దులు దాటితే ఎలా ఉంటుందో.. అలాంటి పాత్రలో నరేశ్ నటించారు. జీవితంలో తప్పులు చేయొచ్చు. సరిదిద్దుకోలేని తప్పులు చేస్తే ఏంటీ అనేది చిత్ర కథ’ అని చెప్పారు.