‘అతడు’ సినిమా చూసేవాడ్ని

ABN, Publish Date - Aug 13 , 2024 | 04:52 AM

‘మహారాజా’ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న ఆయన.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘మహేశ్‌బాబు కథానాయకుడిగా...

‘మహారాజా’ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న ఆయన.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘అతడు’ సినిమా నాకెంతో ఇష్టం. జీవితంలో ఒడిదుడుకులకు లోనైన సమయాల్లో ఆ సినిమాను రిపీట్‌ మోడ్‌లో చూసేవాడ్ని. ఆ సినిమాలో మహేశ్‌ నటన అద్భుతం. ఆయన పలికిన ప్రతీ డైలాగ్‌, సన్నివేశం నాకు బాగా గుర్తుండిపోతుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వ పటిమ.. ఆయన రాసిన సన్నివేశాలతో తెరపై భావోద్వేగాలు బాగా పండాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ, బ్రహ్మానందం కామెడీ, పాటలు నాకు బాగా నచ్చాయి’’ అని తెలిపారు.

Updated Date - Aug 13 , 2024 | 04:52 AM