రాముడిగా...పరశురాముడిగా?

ABN, Publish Date - Sep 11 , 2024 | 04:15 AM

రణ్‌బీర్‌కపూర్‌ శ్రీరాముడి పాత్రధారిగా ‘రామాయణ్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నితేశ్‌ తివారి దర్శకత్వంలో నమిత్‌ మల్హోత్రాతో కలసి యష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...

రణ్‌బీర్‌కపూర్‌ శ్రీరాముడి పాత్రధారిగా ‘రామాయణ్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నితేశ్‌ తివారి దర్శకత్వంలో నమిత్‌ మల్హోత్రాతో కలసి యష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీతమ్మవారి పాత్రను సాయిపల్లవి పోషిస్తున్నారు. యష్‌ రావణుడిగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సన్నీడియోల్‌, లారాదత్తా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2026లో తొలి భాగం విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బాలీవుడ్‌లో వినిపిస్తోంది. రణ్‌బీర్‌కపూర్‌ ఇందులో డబుల్‌ రోల్‌లో కనిపించనున్నారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. రాముడి పాత్రతో పాటు పరశురాముడి పాత్రలోనూ రణ్‌బీర్‌ కనిపించనున్నారట. ఆయన లుక్‌ కూడా సరికొత్తగా ఉండబోతోందని చెబుతున్నారు. రామాయణంలో సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివ ధనుర్భంగం నేపథ్యంలో పరశురాముడి పాత్ర కనిపిస్తుంది. ‘రామాయణ్‌’లో అమితాబ్‌బచ్చన్‌ కూడా భాగమవబోతున్నారట. అయితే ఆయన ఈ చిత్రంలో నటించడం లేదు.


జటాయు పక్షి పాత్రకు అమితాబ్‌బచ్చన్‌ డబ్బింగ్‌ చెప్పేందుకు అంగీకరించాని సమాచారం. ఇక ఈ చిత్రంలో రావణుడి పాత్రలో నటిస్తున్న యశ్‌ డిసెంబర్‌లో చిత్రీకరణలో పాల్గొంటారని చెబుతున్నారు.

Updated Date - Sep 11 , 2024 | 06:28 AM