ట్రెండ్‌కు తగ్గట్లుగా...

ABN, Publish Date - Oct 08 , 2024 | 02:13 AM

గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్‌ సోషల్‌ డ్రామా ‘యుఫోరియా’. నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విఘ్నేశ్‌, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం ఈ సినిమా గ్లింప్స్‌ను...

గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్‌ సోషల్‌ డ్రామా ‘యుఫోరియా’. నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విఘ్నేశ్‌, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం ఈ సినిమా గ్లింప్స్‌ను దిల్‌రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘గ్లింప్స్‌ అదిరిపోయింది. నైట్‌ లైఫ్‌, డ్రగ్స్‌ కల్చర్‌ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ట్రెండ్‌కు తగ్గట్లు రియలిస్టిక్‌గా ఉన్న ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో దాదాపు 90 శాతం మంది కొత్త వారే నటించారు. యూత్‌, పేరెంట్స్‌ మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా కథాంశం’’ అని గుణశేఖర్‌ అన్నారు.

Updated Date - Oct 08 , 2024 | 02:13 AM