జీరోలో హీరోగా
ABN, Publish Date - Aug 16 , 2024 | 12:12 AM
నటుడు శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జీరో’. ఈ స్పోర్ట్స్ డ్రామాను లక్ష్మీనారాయణ దర్శకత్వంలో...
నటుడు శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జీరో’. ఈ స్పోర్ట్స్ డ్రామాను లక్ష్మీనారాయణ దర్శకత్వంలో ఆర్.లక్ష్మణరావు, ఆర్.శ్రీను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. తప్పక విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది’’ అని దర్శకుడు లక్ష్మీనారాయణ అన్నారు. ‘‘ఈ సినిమాలో అందరికీ కనెక్ట్ అయ్యే ఆసక్తికర అంశం ఉంది’’ అని నిర్మాత ఆర్.లక్ష్మణరావు తెలిపారు.