పగిలిన ముక్కలు మళ్లీ అతుక్కోవు

ABN, Publish Date - Nov 21 , 2024 | 06:22 AM

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌. రెహమాన్‌ దంపతులు మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలికిన నేపథ్యంలో వారి తరపు

విడాకులపై ఏఆర్‌ రెహమాన్‌ స్పందన

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌. రెహమాన్‌ దంపతులు మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలికిన నేపథ్యంలో వారి తరపు న్యాయవాది వందనా షా ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా సంచలనం రేగడంతో పాటు పలువురు సెలబ్రిటీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ విడాకుల వ్యవహారంపై ఏఆర్‌.రెహమాన్‌ బుధవారం స్పందించారు. ‘మా దాంపత్య జీవితానికిత్వరలోనే 30 ఏళ్ళు నిండుతాయని సంతోషించాం. అయితే, అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వస్తుందని ఊహించలేదు. విరిగిన హృదయాలు, పగిలిన ముక్కలు యధాతథంగా అతుక్కోలేవు. ఇక నుంచి మాకు నచ్చిన మార్గంలో సంతోషాన్ని వెతుక్కుంటాము’ అని రెహమాన్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు.

- చెన్నై(ఆంధ్రజ్యోతి)

Updated Date - Nov 21 , 2024 | 06:23 AM