Appudo Ippudo Eppudo: నిఖిల్ సినిమా నుండి పాటొచ్చింది..

ABN, Publish Date - Oct 17 , 2024 | 09:36 PM

‘కార్తికేయ 2’ చిత్రంతో నేష‌నల్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్న హీరో నిఖిల్.. ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’‌తో అతి త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ని మేకర్స్ వదిలారు. ఆ సింగిల్ వివరాల్లోకి వెళితే..

Rukmini Vasanth and Nikhil

‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రంతో నేష‌నల్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్న హీరో నిఖిల్ (Nikhil).. ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’‌ (Appudo Ippudo Eppudo)తో అతి త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ‘స్వామి రారా, కేశవ’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ త‌ర్వాత సుధీర్ వర్మ (Sudheer Varma), నిఖిల్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో కన్నడ క్రేజీ హీరోయిన్ అయిన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటించారు. మ‌రో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీల‌క పాత్ర‌లో నటించగా.. హ‌ర్ష చెముడు ఓ ముఖ్య పాత్ర‌ను పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Allu Arjun: యూపీ నుంచి సైకిల్‌పై.. ఫ్యాన్స్ ఎమోషనో.. పర్సనల్ ప్రమోషనో..


టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించిన సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’‌ చిత్రాన్ని నిర్మించారు. యోగేష్ సుధాక‌ర్‌, సునీల్ షా, రాజా సుబ్ర‌మ‌ణ్యం ఈ సినిమాకు కో ప్రొడ్యూస‌ర్స్‌. బాపినీడు.బి ఈ చిత్రానికి స‌మ‌ర్పణ‌. ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ‘హే తార’ అంటూ సాగే ఓ మెలోడియస్ గీతాన్ని యూనిట్ విడుదల చేసింది. కార్తీక్ స్వరపరిచిన ఈ బాణీకి కృష్ణ చైతన్య సాహిత్యాన్ని అందించారు. కార్తీక్, నిత్యశ్రీల గాత్రంలో ఈ పాట ఎంతో వినసొంపుగా శ్రోతలకు హాయినిచ్చేలా ఉంది.

Also Read- TJ Gnanavel: ‘వేట్టయన్ ది హంటర్‌’కి ప్రీక్వెల్‌.. స్టోరీ లైన్ ఏంటంటే..


ఈ పాట హీరో హీరోయిన్ మధ్య ప్రేమ, కెమిస్ట్రీని తెలిపేలా సాగింది. మనోహరమైన సాహిత్యం హృద్యమైన ట్యూన్‌ని కలిగి ఉన్న ఈ మెలోడీతో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రేమలో పడతారనిపిస్తోంది. సింగ‌ర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని.. స‌న్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రిచర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 8న‌ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read- Salman Khan: సల్మాన్ ఇంటి దగ్గర ఫైర్.. బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అరెస్ట్

Also Read- Ram Charan: నిండైన మనసుతో పాపకు ప్రాణం పోశాడు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 17 , 2024 | 09:36 PM