Anushka Shetty: ఆర్‌ఎఫ్‌సీలో రఫ్పాడిస్తోంది!

ABN, Publish Date - Jun 22 , 2024 | 12:50 PM

కథానాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్‌ స్వీటీ అనుష్క (Anushka). గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా బలమైన పాత్రలు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో మెప్పించి తెలుగునాట అద్భుతమైన గుర్తింపు పొందారు.

కథానాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్‌ స్వీటీ అనుష్క (Anushka). గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా బలమైన పాత్రలు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో మెప్పించి తెలుగునాట అద్భుతమైన గుర్తింపు పొందారు. గత ఏడాది ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా క్రిష్‌ దర్శకత్వంలో ఆమె ‘ఘాటి’(Gaati) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది.

అనుష్క, విక్రమ్‌ పలు తదితరులపై మార్కెట్‌ నేపథ్యంలో సాగే పాటను చిత్రీకరిస్తున్నారు. రాజు సుందరం నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాదు కీలక సన్నివేశాల చిత్రీకరణకు కూడా దర్శకుడు ప్లాన చేస్తున్నారు. ఇటీవలే ‘కథనార్‌..’ చిత్రంతో మలయాళంలోకి అడుగుపెట్టింది అనుష్క. ఈ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. 

Updated Date - Jun 22 , 2024 | 12:50 PM