ముందస్తు బెయిల్
ABN, Publish Date - Aug 09 , 2024 | 12:41 AM
నటుడు రాజ్‌తరుణ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజ్‌తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే మహిళ ఫిర్యాదుపై అతనిపై...
నటుడు రాజ్‌తరుణ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజ్‌తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే మహిళ ఫిర్యాదుపై అతనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. రాజ్‌తరుణ్ రెండు వారాల్లో నార్సింగ్ ఎస్‌హెచ్‌వో ఎదుట హాజరుకావాలని, రూ.20 వేల బాండు, రెండు పూచీకత్తులు ఇవ్వాలని జస్టిస్ శ్రీదేవి ధర్మాసనం ఆదేశించింది. 8 వారాల పాటు ప్రతి శనివారం పిటిషనర్ పోలీసుల ఎదుట హాజరుకావాలని షరతు విధించింది. మరోవైపు రాజ్‌తరుణ్ స్నేహితుడు శేఖర్ బాషాతో తనకు ప్రాణహాని ఉందని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.