మరో విజయం ఖాయం
ABN, Publish Date - Dec 15 , 2024 | 01:48 AM
సుబ్బు మంగదేవి దర్శకత్వంలో అల్లరి నరేశ్, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతోందీ చిత్రం...
సుబ్బు మంగదేవి దర్శకత్వంలో అల్లరి నరేశ్, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతోందీ చిత్రం. ఈ సందర్భంగా ట్రైలర్‌ను హీరో నాని శనివారం లాంచ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘బచ్చలమల్లి’ సినిమాతో అల్లరి నరేశ్ మరో విజయం సాధించడం ఖాయం. టీజర్, ట్రైలర్ అదిరిపోయాయి. నాకు బాగా నచ్చిన సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖ ర్. ఆయన సంగీతం ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. అల్లరి నరేశ్ మాట్లాడుతూ ‘సుబ్బు ఎంత అద్భుతంగా ఈ కథ చెప్పారో అంతకన్నా మిన్నగా తెరపైకి తెచ్చారు. ఈ సినిమా నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది’ అని అన్నారు. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించాలని హీరోయిన్ అమృత అయ్యర్ కోరారు. సుబ్బు మాట్లాడుతూ ‘క థను అర్థం చేసుకోని నరేశ్ పాత్రోచితంగా నటించినందువల్లే ఈ సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చింది’ అని అన్నారు. నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ ‘ ఈ క్రిస్మ్‌సకి ‘బచ్చలమల్లి’ మోత మోగిపోద్ది. సినిమాపై అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను’ అని తెలిపారు.