సంక్రాంతి బరిలో మరో సినిమా
ABN, Publish Date - Sep 24 , 2024 | 02:39 AM
వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల జాబితాలో మరో పేరు చేరింది. సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్న 30వ సినిమా అది. ఈ చిత్రానికి ‘మజాకా’ అనే పేరు నిర్ణయించారు...
వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల జాబితాలో మరో పేరు చేరింది. సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్న 30వ సినిమా అది. ఈ చిత్రానికి ‘మజాకా’ అనే పేరు నిర్ణయించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాజేశ్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, రిలీజ్ టైమ్ ఒకేసారి విడుదల చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు నిర్మాత.