పెళ్లిపీటలపై మరో హీరోయిన్‌!

ABN, Publish Date - Aug 24 , 2024 | 06:47 AM

తెలుగు హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్‌ రహస్య గోరఖ్‌ పెళ్లి అయిన రోజునే అంటే గురువారం రాత్రే మరో హీరోయిన్‌

తెలుగు హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్‌ రహస్య గోరఖ్‌ పెళ్లి అయిన రోజునే అంటే గురువారం రాత్రే మరో హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌, ఆమె చిరకాల ప్రియుడు సాయివిష్ణుల నిశ్చితార్థం కేరళలో జరిగింది. తమకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని గురువారం అర్థరాత్రి వెల్లడించి, ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది మేఘా ఆకాశ్‌. పెళ్లి ఎప్పుడన్నది మాత్రం ఆమె పేర్కొనలేదు. సాయివిష్ణు, మేఘా ఆకాశ్‌ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారట.

Updated Date - Aug 24 , 2024 | 06:47 AM