మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gam Gam Ganesha: ఆనంద్ దేవరకొండ ఫస్ట్ యాక్షన్ మూవీ.. కొత్త పోస్టర్ రిలీజ్

ABN, Publish Date - Mar 15 , 2024 | 04:03 PM

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ "గం..గం..గణేశా చిత్ర బృందం కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం.

anand devarkonda

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది "గం..గం..గణేశా (Gam Gam Ganesha) చిత్ర బృందం. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం.


"గం..గం..గణేశా" (Gam Gam Ganesha) మూవీ కొత్త పోస్టర్ లో రకరకాల ఆయుధాలు పట్టుకుని మీదకు వస్తున్న విలన్స్ ను నవ్వుతూ చూస్తున్న ఆనంద్ దేవరకొండ స్టిల్ ఉంది. ఈ విలన్స్ తో పాటే రోజ్ ఫ్లవర్ ఇస్తున్న హీరోయిన్ ను కూడా చూపించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రస్తుతం గం..గం..గణేశా (Gam Gam Ganesha) సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రానుంది.

Updated Date - Mar 15 , 2024 | 04:03 PM