ఎవరూ స్పృశించని కథ
ABN, Publish Date - Nov 06 , 2024 | 03:10 AM
ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని అంశాలతో ‘రహస్యం ఇదం జగత్’ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ తెలిపారు. ఈ నెల 8న ఈ చిత్రం...
ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని అంశాలతో ‘రహస్యం ఇదం జగత్’ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ తెలిపారు. ఈ నెల 8న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా భరద్వాజ్ మీడియాతో ముచ్చటించారు.
తొలి సినిమాను ఓ వైవిధ్యమైన కథతో తీయాలనుకున్నాను. అమెరికాలో శ్రీచక్రం గురించి అన్వేషణ జరిగింది. నేను ఉన్న ప్రాంతంలోనే తవ్వకాలు కూడా జరిగాయి. ఆ సంఘటనే ఈ సినిమా కథకు స్ఫూర్తినిచ్చింది.
ఈ జగత్తు యావత్తు ఓ పెద్ద రహస్యం. అందుకే ‘రహస్యం ఇదం జగత్’ అనే టైటిల్ పెట్టాం. మన పూర్వీకులు, పురాణాల గురించి ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. సినిమాలోని పాత్రలు 14 లోకాలకు టైమ్ ట్రావెల్ చేసే క్రమంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి.