వినోదాన్ని పంచే సినిమా
ABN, Publish Date - Sep 06 , 2024 | 12:33 AM
ఫరియా అబ్దుల్లా నటించిన తాజా చిత్రం ‘మత్తు వదలరా 2’. ఇది 2019 విడుదలై సూపర్ హిట్ అయిన ‘మత్తు వదలరా’ సినిమాకు సీక్వెల్. ఈ నెల 13న విడుదలవుతున్న సందర్భంగా ఫరియా...
ఫరియా అబ్దుల్లా నటించిన తాజా చిత్రం ‘మత్తు వదలరా 2’. ఇది 2019 విడుదలై సూపర్ హిట్ అయిన ‘మత్తు వదలరా’ సినిమాకు సీక్వెల్. ఈ నెల 13న విడుదలవుతున్న సందర్భంగా ఫరియా మీడియాతో ముచ్చటించారు.
‘‘ఈ సినిమా ఒక డిఫరెంట్ థ్రిల్లర్. ఎన్నో ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లతో కూడిన కథ ఇది. ఇందులో పాత్రధారుల కష్టాల నుంచే కామెడీ పుడుతుంది. ఈ సినిమాలో సన్నిధి అనే స్పెషల్ ఏజెంట్ పాత్రలో కనిపిస్తాను. నాది యాక్షన్‌తో నిండిన పాత్ర. దర్శకుడు రితేష్ రాణాకు ఫిల్మ్ మేకింగ్‌లో చాలా అవగాహన ఉంది. ప్రతీ విషయంలో క్లారిటీగా ఉంటారు. కాలభైరవ ఇచ్చిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ సినిమా మొదటి భాగం కంటే మరింత వినోదాన్ని పంచుతుంది. ప్రస్తుతం తిరువీర్‌తో ఓ ప్రేమకథలో నటిస్తున్నా. త్వరలోనే ఓ తమిళ చిత్రం కూడా మొదలవ్వబోతోంది’’ అని ఫరియా చెప్పారు.