ఓ చిన్న పిల్ల ప్రశ్నకు సమాధానం

ABN, Publish Date - Oct 30 , 2024 | 05:42 AM

రాకేశ్‌ గలేబి, స్రవంతి ప్రత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్య తారలుగా కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్‌’. పద్మ రావినూతల, హిరణ్య రావినూతల నిర్మాతలు...

రాకేశ్‌ గలేబి, స్రవంతి ప్రత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్య తారలుగా కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్‌’. పద్మ రావినూతల, హిరణ్య రావినూతల నిర్మాతలు. ఈ చిత్రం నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు చందు మొండేటి విడుదల చేశారు. ‘ఈ టీజర్‌ చూసి ఎగ్జైట్‌గా ఫీలయ్యాను. ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా నేను వేటికి అయితే ఎక్కువగా ఎగ్జైట్‌ అవుతానో, కనెక్ట్‌ అవుతానో, చదువుతానో, రీసెర్చ్‌ చేస్తానో...వాటికి సిమిలర్‌గా ఈ సినిమా కాన్సెప్ట్‌ ఉంది. జనాలు ఇలాంటి సినిమాలు చూసే మూడ్‌లో ఉన్నారు. తప్పకుండా ఈ చిత్రం అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు చందు మొండేటి.


ఈ చిత్ర దర్శకుడు కోమల్‌ ఆర్‌. భరద్వాజ్‌ మాట్లాడుతూ‘ నాకు కార్తికేయ సినిమా ఇన్‌స్పిరేషన్‌. దాని ప్రేరణతో ఈ చిత్రాన్ని రూపొందించాను. ‘ఈ సినిమా ఓన్లీ మైథాలజీ కాదు. రాముడు, హనుమంతుడికేనా మనకు కూడా జరుగుతుందా’ అని ఓ చిన్న పిల్ల అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉంటుంది. అందరికీ గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇది. సైన్స్‌ ఫిక్షన్‌కు మైథలాజికల్‌ అంశాలు జోడించి నేటి తరం ప్రేక్షకుల మెప్పు పొందే విధంగా రూపొందించాం’ అని అన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 08:38 AM