40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అయోధ్యలో స్థలం కొన్న అమితాబ్‌

ABN, Publish Date - Jan 17 , 2024 | 06:15 AM

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగుతుంది. దేశ, విదేశాలలో ఉన్న వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది. రామమందిరం ఏర్పాటుతో అయోధ్య పరిసర ప్రాంతాల...

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగుతుంది. దేశ, విదేశాలలో ఉన్న వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది. రామమందిరం ఏర్పాటుతో అయోధ్య పరిసర ప్రాంతాల రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయి. రామమందిరం ప్రారంభోత్సవం రోజునే సరయూ నది ప్రాంతంలో 45 ఎకరాల్లో ‘సరయు ప్రాజెక్ట్‌’ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హౌస్‌ ఆఫ్‌ అభినందన్‌ లోధా కొత్త వెంచర్‌ ప్రారంభిస్తోంది. సరయు నది ఒడ్డున ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కూడా నిర్మించడానికి ఇప్పటికే లీలా ప్యాలెస్‌ గ్రూప్‌తో ఒప్పందం చేసుకుందీ సంస్థ. ఈ నేపథ్యంలో అమితాబ్‌ బచ్చన్‌ ఈ సంస్థలో పది వేల చదరపు అడుగుల స్థలం కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీని విలువ ఎంతో తెలుసా? రూ. 14 కోట్ల 50 లక్షలు. ‘ఈ ఆధ్యాత్మిక నగరంలో ఇల్లు కట్టుకోవాలన్నది నా కోరిక. అందుకే ఈ స్థలం కొన్నాను’ అని అమితాబ్‌ పేర్కొన్నారు. అయోధ్యలో అమితాబ్‌ స్థలం కొనడంతో అక్కడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో జోష్‌ పెరగడం ఖాయం!

Updated Date - Jan 17 , 2024 | 06:15 AM