Naa Nireekshana: ‘నా నిరీక్షణ’కు నిర్మాత దిల్ రాజు క్లాప్

ABN, Publish Date - Oct 13 , 2024 | 11:55 AM

బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా రెండో చిత్రం ప్రారంభమైంది. ఇప్పటికే ఆయన ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయదశమిని పురస్కరించుకుని తన రెండో చిత్రానికి క్లాప్ కొట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..

Naa Nireekshana Movie Opening

పికాక్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై పి. సంతోష్ రెడ్డి నిర్మాణంలో బిగ్ బాస్ ఫేమ్ (Bigg Boss Fame) అమర్ దీప్ (Amardeep), లిషి గణేష్ కల్లపు హీరోహీరోయిన్లుగా.. సాయి వర్మ దాట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చిత్రం ‘నా నిరీక్షణ’ (Naa Nireekshana). దసరా సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ‘నా నిరీక్షణ’ మూవీ పూజా కార్యక్రమాలకు దిల్ రాజు, సురేష్ బాబు, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సురేష్ బాబు ఆశీస్సులతో పూజా కార్యక్రమాలు మొదలవగా.. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టారు. రాజా రవీంద్ర స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కు అందజేశారు. నిర్మాత గణపతి రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ చిత్ర టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. (Naa Nireekshana Movie Opening)

Also Read- Nara Family Marriage: నారా రోహిత్, సిరిల నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్కడంటే?

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయి వర్మ దాట్ల మాట్లాడుతూ.. దసరా ఫెస్టివల్‌లో బిజీగా ఉంటారనుకున్నాం.. అయినా మా టీంను ఆశీర్వదించేందుకు వచ్చిన సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, రాజా రవీంద్ర గారికి థాంక్స్. సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేను కానీ ఓ మంచి చిత్రాన్ని అయితే ప్రేక్షకులకు ఇస్తున్నాననే నమ్మకం ఉందని అన్నారు. హీరోయిన్ లిషి గణేష్ కల్లపు మాట్లాడుతూ.. ఇది నా రెండో చిత్రం. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఆడియెన్స్ మా సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Also Read- Devara: ఫ్యాన్స్ కోసమే.. ‘దేవర’ కలెక్షన్స్‌పై నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు



అమర్ దీప్ మాట్లాడుతూ.. హీరోగా ఇది నా రెండో చిత్రం. బిగ్ బాస్ తరువాత సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ స్క్రిప్ట్ ఇది. దర్శక, నిర్మాతలు ఈ మూవీ మీదే ఏడు నెలలు పని చేశారు. వారి వల్లే ఈ మూవీ ఇక్కడి వరకు వచ్చింది. నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్ అని చెప్పగా.. చైతన్య వర్మ మాట్లాడుతూ.. మా చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంతకు ముందు నన్ను ‘హిట్, ఝాన్సీ, సరెండర్’ వంటి సినిమాల్లో చూశారు. ఈ చిత్రంలో నాకు మంచి పాత్ర లభించింది. మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, ఈ చిత్రానికి తిరుమలేష్ బండారు మాటలు అందిస్తుండగా.. వి. రవి కుమార్ కెమెరామెన్‌గా పని చేయనున్నారు. శేఖర్ చంద్ర సంగీత సారథ్యంలో ఈ మూవీ రానుంది.

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2024 | 11:55 AM