Amaran: అప్పుడు ‘విక్రమ్’.. ఇప్పుడు ‘అమరన్’
ABN, Publish Date - Aug 24 , 2024 | 09:45 PM
విశ్వనటుడు కమల్ హాసన్‌కు చెందిన RKFI అండ్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, శివకార్తికేయన్, రాజ్‌కుమార్ పెరియసామిల ‘అమరన్’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి యొక్క శ్రేష్ఠ్ మూవీస్ సొంతం చేసుకుంది. ఇంతకు ముందు ఈ సంస్థ కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన విషయం తెలిసిందే.
విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan)కు చెందిన RKFI అండ్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, శివకార్తికేయన్ (Sivakarthikeyan), రాజ్‌కుమార్ పెరియసామిల ‘అమరన్’ (Amaran) మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి యొక్క శ్రేష్ఠ్ మూవీస్ సొంతం చేసుకుంది. ఇంతకు ముందు ఈ సంస్థ కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ (Vikram) చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కమల్ హాసన్ శ్రేష్ఠ్ మూవీస్ (Sreshth Movies)కు ఆ హక్కులను అప్పగించారు.
Also Read- Chiru- Balayya: చిరుని ఆప్యాయంగా పిలిచిన బాలయ్య.. మాటిచ్చేసిన చిరు!
ప్రిన్స్ శివకార్తికేయన్ ద్విబాషా యాక్షన్ చిత్రం ‘అమరన్’. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) రచన, దర్శకత్వం వహించారు. ఉలగనాయగన్ కమల్ హాసన్, Mr. R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. రాబోయే దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అతని సోదరి నిఖితారెడ్డి ఈ సినిమా ఏపీ, టీఎస్‌ల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెన్సేషనల్ హిట్ ‘విక్రమ్’ తర్వాత కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్‌తో శ్రేష్ఠ్ మూవీస్‌కి ఇది రెండవ చిత్రం కావడం విశేషం.
‘విక్రమ్’ చిత్రం సమయంలో చేసిన ప్రమోషన్లు, భారీ స్థాయిలో విడుదల నిమిత్తం సుధాకర్ రెడ్డి చేసిన ప్రయత్నంపై కమల్ హాసన్ తన సంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రేష్ఠ్ మూవీస్ ఇక్కడ విడుదల చేయడంతో తన చిత్రం ‘అమరన్’ మరింతగా విజయపథంలోకి వెళ్ళనున్నదనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘అమరన్’లో శివకార్తికేయన్ మునుపెన్నడూ చూడని సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. శివకార్తికేయన్ సరసన ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ‘ఇండియాస్ మోస్ట్’ అనే పుస్తకంలోని ‘మేజర్ వరదరాజన్’ కథ ఆధారంగా రూపొందించబడుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Read Latest Cinema News