అల్లు అరవింద్‌ ఆటపట్టించారు

ABN, Publish Date - Aug 19 , 2024 | 04:57 AM

అంకిత్‌ కొయ్యప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అంకిత్‌....

అంకిత్‌ కొయ్యప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అంకిత్‌ మీడియాతో ముచ్చటించారు. ‘‘ఈ సినిమాలో ఇంద్రజగారు నా తల్లి పాత్ర చేశారు. ఆమె సూచన మేరకే దర్శకుడు నన్ను ఎంపిక చేశారు. ఇందులో నా పాత్రకు ‘నేను అల్లు అరవింద్‌ కొడుకును, బన్నీ మా అన్నయ్య’ అనే డైలాగ్‌ ఉంది. ఈ మధ్య అల్లు అరవింద్‌గారిని కలిసినప్పుడు ‘నా కొడుకునని చెప్పుకొని తిరుగుతున్నావంట... తెలిసింది’ అని సరదాగా ఆట పట్టించారు. రావు రమేశ్‌ కాంబినేషన్‌లో వచ్చే సీన్లు వినోదం పంచుతాయి’ అని ఆయన తెలిపారు.

Updated Date - Aug 19 , 2024 | 04:57 AM