తొలి ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌?

ABN, Publish Date - Oct 19 , 2024 | 06:31 AM

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4’ ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తొలి ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ గెస్ట్‌గా

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4’ ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తొలి ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ గెస్ట్‌గా కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తయిందనీ, అల్లు అర్జున్‌ తాజా చిత్రం ‘పుష్ఫ 2’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ చిత్రబృందం కూడా ‘అన్‌స్టాపబుల్‌’ షో లో పాల్గొందని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను త్వరలో విడుదల చేయనున్నారు. ఇద్దరు మాస్‌ హీరోలు పాల్గొంటున్న ఈ ఎపిసోడ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన నంద్యాల ఎపిసోడ్‌ గురించి అల్లు అర్జున్‌ని బాలకృష్ణ ప్రశ్నించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ‘అన్‌స్టాపబుల్‌’ వేదికగా ఆ వివాదం గురించి వివరణ ఇచ్చి ఇంతటితో దాన్ని ముగించాలని అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ప్లాన్‌ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యాక ఈ విషయం మీద క్లారిటీ వస్తుందని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.

Updated Date - Oct 19 , 2024 | 06:32 AM