గగనాలన్నీ పూలడుగులు భువనాలన్నీ పాలమడుగులు

ABN, Publish Date - Nov 29 , 2024 | 06:13 AM

శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. దిల్‌ రాజు, శిరీష్‌ భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతోంది...

శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. దిల్‌ రాజు, శిరీష్‌ భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతోంది. ఈ చిత్రం నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ విడుదలైంది. ఈ పాటను తెలుగులో రామ జోగయ్య శాస్త్రి, తమిళంలో వివేక్‌, హిందీలో కౌశర్‌ మునీర్‌ రాశారు. భారతీయ సినిమాల్లో తొలిసారిగా రెడ్‌ ఇన్‌ఫ్రా కెమెరాతో ఈ పాటను న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. సంగీత దర్శకుడు తమన్‌ ఈ పాటను ఫ్యూజన్‌ మెలోడీ(వెస్ట్రన్‌, కర్ణాటక కాంబో)గా ట్యూన్‌ చేశారు. శ్రేయా ఘోషల్‌, కార్తీక్‌ పాడారు.

Updated Date - Nov 29 , 2024 | 06:13 AM