20 నుంచి అక్కినేని చలనచిత్రోత్సవం

ABN, Publish Date - Sep 04 , 2024 | 03:28 AM

లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు ఆయన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ (ఎఫ్‌.హెచ్‌.ఎ్‌ఫ) ఒక ప్రకటనలో...

లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు ఆయన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ (ఎఫ్‌.హెచ్‌.ఎ్‌ఫ) ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్కినేని కుటుంబ సభ్యుల సహకారంతో నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్స్‌, పీవీఆర్‌ ఐనాక్స్‌ లతో కలసి ‘ఏయన్నార్‌ 100- కింగ్‌ ఆఫ్‌ ద సిల్వర్‌స్ర్కీన్‌’ పేరుతో ఈ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఫిల్మ్‌ మేకర్‌, ఎఫ్‌.హెచ్‌.ఐ. డైరెక్టర్‌ శివేంద్ర సింగ్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపిక చేసిన అక్కినేని అద్భుత చిత్రాలు పదింటిని హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలతో సహా 25 ప్రాంతాల్లో ప్రదర్శిస్తామని ఆయన వెల్లడించారు. ఇంతకుముందు అమితాబ్‌ బచ్చన్‌, దిలీప్‌కుమార్‌, దేవానంద్‌ చిత్రోత్సవాలను ఎఫ్‌.హెచ్‌.ఐ నిర్వహించినట్లు శివేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.

Updated Date - Sep 04 , 2024 | 03:28 AM