ప్రియురాలితో అఖిల్‌ నిశ్చితార్థం

ABN, Publish Date - Nov 27 , 2024 | 06:22 AM

అక్కినేని అఖిల్‌కి తన ప్రియురాలు జైనబ్‌ రవ్జీతో నిశ్చితార్థం జరిగింది. జైనబ్‌ రవ్జీ.. ఢిల్లీకి చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌, ఇన్‌ప్లూయెన్సర్‌. త్వరలోనే తన కొడుకు ఓ ఇంటివాడు కాబోతున్నాడని నాగార్జున మంగళవారం...

అక్కినేని అఖిల్‌కి తన ప్రియురాలు జైనబ్‌ రవ్జీతో నిశ్చితార్థం జరిగింది. జైనబ్‌ రవ్జీ.. ఢిల్లీకి చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌, ఇన్‌ప్లూయెన్సర్‌. త్వరలోనే తన కొడుకు ఓ ఇంటివాడు కాబోతున్నాడని నాగార్జున మంగళవారం సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ‘‘జైనబ్‌ను మా కోడలిగా ఆహ్వానిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాబోయే దంపతులకు మీ ఆశీస్సులు కావాలి’’ అని పేర్కొన్నారు. అక్కినేని ఇంట జరిగిన ఈ నిశ్చితార్థానికి ఇరువురి కుటుంబ సభ్యులు, అతి కొద్ది సంఖ్యలో అతిథులు పాల్గొన్నారు. కాగా అఖిల్‌, జైనబ్‌లకు రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలూ వీరి ప్రేమను అంగీకరించాయి. మరోవైపు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబరు 4న జరుగుతున్న సంగతి తెలిసిందే.

Updated Date - Nov 27 , 2024 | 06:22 AM