సంక్రాంతి తర్వాత ...

ABN, Publish Date - Dec 17 , 2024 | 06:07 AM

మహేశ్‌బాబు, రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకొనే చిత్రం షూటింగ్‌ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌. శ్రీ దుర్గా ఆర్ట్స్‌ బేనరుపై డాక్టర్‌ కె.ఎల్‌.నారాయణ నిర్మించే ఈ చిత్రం...

మహేశ్‌బాబు, రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకొనే చిత్రం షూటింగ్‌ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌. శ్రీ దుర్గా ఆర్ట్స్‌ బేనరుపై డాక్టర్‌ కె.ఎల్‌.నారాయణ నిర్మించే ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే నెల చివరి వారంలో ప్రారంభం కానుంది. మహేశ్‌ డేట్స్‌ కేటాయించడంతో షూటింగ్‌ ఏర్పాట్లలో రాజమౌళి టీమ్‌ బిజీగా ఉంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో కొన్ని భారీ సెట్స్‌ వేశారు. తొలి షెడ్యూల్‌ వాటిల్లోనే జరుగుతుందని సమాచారం. అలాగే సినిమాలో కీలకమైన ఫారెస్ట్‌ సీన్స్‌ను ఆఫ్రికాలోని కెన్యా అడవుల్లో చిత్రీకరించడానికి రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారు. సినిమా షూటింగ్‌ ప్రారంభించే ముందు ప్రెస్‌మీట్‌ పెట్టి కథ, ఇతర వివరాలు వెల్లడించడం రాజమౌళికి అలవాటు. అలాగే ఈ సినిమా గురించి కూడా ఓ ప్రెస్‌మీట్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. చిత్రంలో హీరోయిన్‌, ఇతర తారాగణం ఎవరు.. అనే వివరాలను కూడా ఆ ప్రెస్‌మీట్‌లోనే వెల్లడిస్తారు రాజమౌళి. దాదాపు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మహేశ్‌ ఇంతవరకూ పోషించని విభిన్న పాత్రను ఇందులో చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - Dec 17 , 2024 | 06:07 AM