‘రంగస్థలం’ తర్వాత.. అంత బాగా తీసిన చిత్రమిదే
ABN, Publish Date - Oct 23 , 2024 | 02:11 AM
యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో సురేశ్‌కుమార్ సడిగె నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం...
యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో సురేశ్‌కుమార్ సడిగె నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు సందీ్‌పరెడ్డి వంగా మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చూశాను. దర్శకుడు సాహిత్ అద్భుతంగా తెరకెక్కించారు. ‘రంగస్థలం’ తర్వాత.. రూరల్ బ్యాక్‌డ్రా్‌పలో అంత బాగా తీసిన చిత్రమిదే’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా మీకు మునుపెన్నడూ చూడని అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాను’’ అని దర్శకుడు సాహిత్ మోత్కూరి అన్నారు. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు గర్వపడుతున్నా’’ అని హీరోయిన్ అనన్య నాగళ్ల తెలిపారు.