Ester Noronha: ఎస్తర్ బైక్ పైన కూర్చొని ఏమి చేసిందో చూశారా!

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:26 PM

ఎస్తర్ నటిగా బిజీగా ఉంటూనే, నిర్మాతగా మరి సినిమా నిర్మించి, ఆ సినిమాకి తనే దర్శకత్వం, రచన, నేపధ్యగానం, సంగీతం అందించి తన ప్రతిభని చాటుకుంది. ఇప్పుడు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది, బెంగుళూరులో ఆడవాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా ఒక సెలూన్ ని ఓపెన్ చేసింది.

Ester Noronha: ఎస్తర్ బైక్ పైన కూర్చొని ఏమి చేసిందో చూశారా!
Ester Noronha

ఎస్తర్ మళ్ళీ బిజీ అయిపోతోంది. ఆ మధ్య ఆమె ఒక పోలీసాఫీసర్ గా నటించిన 'టెనంట్' సినిమా థియేటర్ లో విడుదలయింది. ఇప్పుడు అది ఓటిటి లో కూడా ప్రసారం అవుతోంది. అందులో ఎస్తర్ ఇంతకుముందు చేయనటువంటి పోలీసు పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఒక హత్య జరుగుతుంది, అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయంలో ఎస్తర్ పరిశోధన చేస్తూ ఉంటుంది. (Actress Ester is now entered into business with opening a salon called Frimousse at Benguluru)

estermotorbike.jpg

అలాగే సినిమాలో నటిస్తూనే, నిర్మాతగానే కాకుండా, దర్శకత్వం, రచన, నేపధ్యగానం, సంగీతం ఇలా అన్ని రంగాల్లో తన ప్రతిభని చూపింది ఎస్తర్. ఇప్పుడు వ్యాపారంలో కూడ అడుగు పెట్టింది ఎస్తర్. (Ester Starrer Tenant movie is now streaming on Amazon Prime Video)

estermotorbikea.jpg

బెంగుళూరులో సెలూన్ షాపును ప్రారంభించింది. ఫ్రిమౌస్సె అనే ఈ సెలూన్ ఒక మేకప్ స్టూడియో, అకాడమీ కూడాను. ఇది కేవలం ఆడవాళ్లకోసమే అని చెప్పి బెంగుళూరులో మొదటి ఎస్తర్ ప్రారంభించింది. ఇక్కడ నిపుణలైన వారిచే అన్ని వయసులవారికి స్కిన్, హెయిర్, ఇంకా మేకప్ కి సంబంధించి కేర్ తీసుకుంటారు అని చెపుతోంది ఎస్తర్.

Updated Date - Jun 08 , 2024 | 04:26 PM