Ester Noronha: చీరలో ఎస్తర్ ఏంటి ఇంత హాట్ గా వుంది

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:22 PM

ఎస్తర్ 'మాయ' సినిమా ప్రచారాలు చేస్తోంది. ఈ సినిమా మార్చి 15న విడుదలవుతోంది. ఇంతవరకు తాను చెయ్యని పాత్ర ఈ సినిమాలో చేస్తున్నాను అని, ప్రేక్షకులకి కొత్తగా కనపడతాను అని చెపుతోంది ఎస్తర్

Ester Noronha: చీరలో ఎస్తర్ ఏంటి ఇంత హాట్ గా వుంది
Ester Noronha

ఎస్తర్ 'మాయ' సినిమాలో కథానాయకురాలిగా నటించింది. ఈ సినిమా వచ్చే వారం మార్చి 15న విడుదలవుతోంది. రమేష్ నాని ఈ సినిమాకి దర్శకుడు, కాగా రాజేష్ నిర్మాత. ఒక సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు లంచ్ టైములో ఈ కథ వచ్చి దర్శకుడు రమేష్ నాని చెప్పారని, వెంటనే నచ్చి ఒకే చేసానని ఎస్తర్ చెప్పారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ వుంటాయని, అందరూ చూడాల్సిన సినిమా అని ఎస్తర్ చెప్పారు.

esternoronhapicsix.jpg

ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని చెపుతోంది ఎస్తర్. అయితే ఆ రెండు ఎలెమెంట్స్ కాకుండా, ఈ సినిమాలో భావోద్వేగాలకు పెద్దపీట వేశారని చెపుతోంది. ఈ సినిమాకి పనిచేసిన దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ దగ్గర నుండి చాలామంది కొత్తవారు పనిచేశారని చెప్పింది. ఇలా ఒక కొత్త టీముతో పనిచెయ్యడం తనకి చాలా హ్యాపీగా వుంది అని చెపుతోంది. (Ester Noronha talks about her upcoming film Maya)

esternoronhapicfour.jpg

తాను ఇంతకు ముందు 'డెవిల్' అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ పాత్ర వేశానని, అలాగే ఇంకా కొన్ని సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేశానని, కానీ ఈ సినిమాల్లో ప్రధాన పాత్రలో కనపడతాను అని చెపుతోంది.

esternoronhapicseven.jpg

క్యారెక్టర్ పాత్రలో ఎస్తర్ చేసింది, అందుకని ఆమెకి ఇంకా కథానాయిక పాత్రలు రావు అని చాలామంది అనుకునేవాళ్లు. వాళ్ళ ఆలోచనలు తప్పు అని ఈ 'మాయ' సినిమా చూసాక అర్థం అవుతుంది అని చెప్తోంది.

esternoronhapiceight.jpg

ఈ సినిమాలో హర్రర్, థ్రిల్లర్, భావోద్వేగాలుంటాయి. అలాగే ఈ సినిమా ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ. ఈ సినిమా థీమ్ కొత్తది, ఇది నాకు మంచి పేరు తీసుకు వస్తుంది అని అనుకుంటున్నాను అని చెప్పింది ఎస్తర్. ఎందుకంటే నేను ఈ సినిమాలో చేసిన పాత్ర ఇంతవరకు చెయ్యలేదు, చాలా కొత్తగా కనపడతాను ఇందులో.

esternoronhapicfour.jpg

ఒక పక్క 'మాయ' ప్రచారాలు చేస్తూనే, ఇంకో పక్క కొత్త సినిమాల షూటింగ్ డే అండ్ నైట్ షూట్ చేస్తున్నాను. రెండు మూడు సినిమాలు ఒకేసారి చేస్తున్నాను, షూటింగ్ కూడా ఒక సినిమా పగలు చేస్తే, ఇంకో సినిమా రాత్రి చేస్తున్నాను. మధ్యలో ఎప్పుడైనా టైము దొరికితే 'మాయ' సినిమాకి ప్రచారాలు చేస్తున్నాను అని చెప్పింది ఎస్తర్.

Updated Date - Mar 09 , 2024 | 01:22 PM