సుబ్రహ్మణ్య సాహసాలు
ABN, Publish Date - Sep 01 , 2024 | 05:28 AM
ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ మరోసారి మెగాఫోన్ పట్టారు. తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ ‘సుబ్రహ్మణ్య’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు...
ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ మరోసారి మెగాఫోన్ పట్టారు. తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ ‘సుబ్రహ్మణ్య’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. తిరుమల్‌రెడ్డి, అనిల్ కడియాల ఈ చిత్రానికి నిర్మాతలు. ఇప్పటికే అరవై శాతం నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఈ సినిమాను అడ్వంచర్ థ్రిల్ అందించడానికి బిగ్ ఫార్మెట్‌లో చిత్రీకరిస్తున్నారు. అద్భుతమైన కథతో గ్రాండ్ విజువల్స్, ఎమోషనల్ ట్రీట్‌తో సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీత దర్శకుడు. విఘ్నేష్ రాజ్ చాయాగ్రాహకుడు.