సాహస గాథ
ABN, Publish Date - Dec 01 , 2024 | 06:33 AM
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, ‘కై పో చే’ ఫేమ్ అభిషేక్ కపూర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఆజాద్’. ఈ సినిమాతో అజయ్ దేవగణ్ మేనల్లుడు ఆమన్ దేవగణ్ హీరోగా...
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, ‘కై పో చే’ ఫేమ్ అభిషేక్ కపూర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఆజాద్’. ఈ సినిమాతో అజయ్ దేవగణ్ మేనల్లుడు ఆమన్ దేవగణ్ హీరోగా, రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. రోనీ స్ర్కూవాలా, ప్రగ్యా కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అజయ్ దేవగణ్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఈ సాహస గాథను వచ్చే ఏడాది జనవరి 17న తిలకించడానికి సిద్ధమవ్వండి అని తెలిపారు.